గత వారం విడుదలైన కేర్ అఫ్ సూర్య చిత్రానికి సంబందించిన ఒక కీలక విషయం తెలిసింది.
అదేంటంటే- మొన్న విడుదల సమయంలో ఆకహరి నిమిషంలో చిత్రంలోని హీరోయిన్ ఉన్న సన్నివేశాలని కత్తిరించడం జరిగింది అయితే వారు అనుకున్న విధంగా ప్రేక్షకుల నుండి స్పందన రాలేదు. దీనితో ఈ చిత్రాన్ని ప్రస్తుతం థియేటర్ల నుండి ఉపసంహరించుకుంట్టున్నారట.
ఇక ఆ కత్తిరించిన సన్నివేశాలని మళ్ళీ కలిపి డిసెంబర్ 15న మళ్ళీ విడుదల చేసే పనిలో ఉన్నారట యూనిట్ సభ్యులు. దీనితో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రం పైన పడింది.
మరి రీ-రిలీజ్ లో అయినా వారు కోరుకున్న టాక్ వారికి రావాలి అని కోరుకుందాము.