ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అన్న వాదనని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం సమర్దించాడు.
ఆయన ఈ మధ్యకాలంలో పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా ‘స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం తప్పిదమే అని అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వడం తప్పనిసరి అని తన మనసులోని మాటని బయటపెట్టేశాడు.
దీనితో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం గళమేత్తిన నటుల జాబితాలో ప్రకాష్ రాజ్ కూడా చేరిపోయారు. ఇదే సందర్భంలో ఓట్ల రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా- తాను రాను అని క్లారిటీ ఇచ్చేశాడు.