నటి ఖుష్బు ఇటు చిత్రాల్లోనూ అటు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. ఇక ఆమె పైన నిన్న చెన్నైలో పోలీసు కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే, నిన్న చెన్నైలో రాష్ట్రంలోని ఒక జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. అందుకు సంబందించి పోలిసుల నుండి అనుమతి తీసుకున్నారు. అయితే వారు ఇచ్చిన సమయం దాటడంతో అందులో పాల్గొన్న ఖుష్బు పైన రెండు వేర్వేరు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
అయితే దీనికి కారణం ఖుష్బుకి ఆమె సొంత పార్టీలోనే అసమ్మతి ఉండడం, వారు ఈ సమావేశంలో చేసిన రసాభాస కారణంగానే సమయం దాటిపోవడం తద్వారా ఆమె పైన కేసు నమోదు అవ్వడం జరిగింది అని ఆమె వర్గం వారు ఆరోపిస్తున్నారు.
రానున్న రోజుల్లో ఖుష్బుకి రాజకీయాల్లో ఇంకెన్ని సవాళ్ళు ఎదురుకానున్నాయో చూడాలి.