బాలీవుడ్ హీరో కొడుకు పైన రేప్ కేసు నమోదు

By iQlikMovies - July 03, 2018 - 19:08 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి కొడుకు పైన రేప్ అభియోగాలు రావడం ఇప్పుడు ముంబైలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది.

 

అసలేం జరిగిందంటే- ఓ వర్తామన నటితో మిథున్ కొడుకు అయిన మహాక్షయ ప్రేమ వ్యవహారం నడపడం, పెళ్ళి కూడా చేసుకుంటాను అని చెప్పి సదరు నటిని గర్భవతిని చేశాడట. తాను గర్భవతి అని తెలిసాక పెళ్ళి విషయం ప్రస్తావన తీసుకురాగా మహాక్షయ మొహం చాటేసినట్టు ఆమె ఆరోపిస్తుంది.

ఇక ఇదే విషయమై తన కొడుకు జోలికి రావద్దు అని యోగితా బాలి కూడా తనని బెదిరించింది అని ఢిల్లీ కోర్టుకి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన దానిని ఆధారం చేసుకుని పోలీసులని మహాక్షయ పైన కేసు నమోదు చేసి తక్షణమే ఆ నటికి భద్రత కల్పించాలి అని ఆదేశించింది కోర్టు. 

దీనితో మహాక్షయ పైన అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS