ఈమధ్య కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తులు అనవసర విషయాల్లో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. కాస్టింగ్ కౌచ్, చికాగో సెక్స్ రాకెట్ ఇలా ఒకదాని వెంట మరొకటి చిత్ర పరిశ్రమని కుదేలుచేశాయి.
ఇక వీటినుండి బయటపడక ముందే, ఒక నిర్మాత పైన వేధింపులు కేసు నమోదు అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే, రాజా మీరు కేక చిత్రాన్ని నిర్మించిన రమేష్ రెడ్డి పైన ఆ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసిన రవి రెడ్డి భార్య ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిరదు చేసింది.
అసలేమైంది అంటే సినిమా షూటింగ్ అయిపోయాక నిర్మాత రమేష్ రెడ్డి నుండి కెమెరామెన్ రవి రెడ్డి రూ 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక ఆ తరువాత తన డబ్బుని తనకి ఇచ్చేయమని పదే పదే అడుగుతూ రవి రెడ్డి ఇంటికి వెళుతూ అక్కడ ఉన్న రవి రెడ్డి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడట.
దీనితో రమేష్ రెడ్డి పైన పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది.