హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్డి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘననపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద రాయదుర్గం పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.
శుక్రవారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించడం వల్ల.. పెను ప్రమాదం తప్పినట్టైంది.