ప్రముఖ టీవీ యాంకర్ ప్రశాంతిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీఎల్ లో భాగంగా ఆదివారం సర్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కొలకొత్తా నైట్ రైడర్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్లిన ప్రశాంతి పై న్యూసెన్స్ కేసు నమోదైంది.
తమని మ్యాచ్ చూడకుండా కొంతమంది అడ్డుకున్నారని, స్టేడియంలో అసభ్యకరంగా ప్రవర్తించారని వీఐపీ గ్యాలరీ లోంచి మ్యాచ్ చూస్తున్న భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శాంటోష్ ఉపాధ్యాయ్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ గమనించిన ఉప్పల్ పోలీసులు ప్రశాంతితో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఓ క్రికెట్ స్టేడియంలో ఇలాంటి కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి అని ఉప్పల్ పోలీసులు చెబుతున్నారు.