ముద్దుగుమ్మ కేథరీన్ ట్రెసా ఫిజిక్ పరంగా కరెక్ట్‌గానే ఉంటుంది. బొద్దుగా ఏమీ కన్పించదు. కానీ ఈ ముద్దుగుమ్మ అలా ఫీలయినట్టుంది. అందుకే కొంచెం సన్నబడింది. ఆ సన్నబడ్డం వెనుక డాన్సులే కారణమని అంటోంది. 'సరైనోడు' సినిమాలో డాన్సులేయడానికి కొంచెం ఇబ్బందిపడిందట. దాంతో కొంచెం సన్నబడాలని అనుకున్నదట. బన్నీ సలహాతో అమ్మడు కాస్త సన్నబడిందని సమాచారమ్. బన్నీ, మంచి స్నేహితుడు కదా. అతనితో చాలా సినిమాలు చేసేసింది కేథరీన్. ఈ ఇద్దరి మధ్యా ఉన్న స్నేహ బంధం చాలా దృఢమైనది. చాలా ఆఫర్స్ ఈ ముద్దుగుమ్మకి బన్నీ ఆఫర్ చేయడం వల్లే లభించాయన్న ప్రచారం కూడా ఉంది. లేటెస్టుగా 'గౌతమ్ నందా' సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రావడమేనా, హాట్ టాపిక్ అయిపోయింది కూడా. ఎందుకో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అమ్మడి బికినీ షోనే అందుకు కారణం. అవును ఈ ముద్దుగుమ్మ టూ పీస్ బికినీలో కనిపించి, సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆడియన్స్‌ని హీటెక్కించేసింది. అయితే గత సినిమాల్లో కన్నా కేథరీన్ ఈ సినిమాలో కొంచెం సన్నగా కనబడడం వెనకాల రీజన్ బికినీనే అంటున్నారు కొందరు. కాదు, డాన్సుల కోసమంటోంది ఈ ముద్దుగుమ్మ. ఏమో ఏది నిజమో కానీ, మొత్తానికి కొద్దిగా సన్నబడి, తన అందాలకు మరింత పదును పెట్టినట్లే అనిపిస్తోంది బ్యూటీ కేథరీన్ ట్రెసా.