గ్లామర్‌లో హద్దులు తెలుసంటోన్న కేథరీన్‌

మరిన్ని వార్తలు

గ్లామరస్‌ బ్యూటీగా ముద్దుగుమ్మ కేథరీన్‌కి మంచి పాపులారిటీ ఉంది. హుందా అయిన క్యారెక్టర్స్‌లో నటిస్తూనే అమ్మడు గ్లామరస్‌గా కనిపించడంలోనూ ఏమాత్రం వెనుకాడదు. అయితే తన గ్లామర్‌లో అస్సలు వల్గారిటీ ఉండదంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా 'గౌతమ్‌నందా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓవర్‌ డోస్‌లో గ్లామర్‌ పండించేసింది కేథరీన్‌. ఏకంగా బికినీలో కనిపించి కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసిందిన సంగతి తెలిసిందే. మామూలుగా బికినీలో ముద్దుగుమ్మలు ఇలా కనిపించి అలా మాయమవుతారు. బికినీ షాట్స్‌ చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో కేథరీన్‌ బికినీ షాట్‌ నిడివి మామూలుగా కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దాంతో కుర్రకారు కేథరీన్‌ బికినీ అందాల షో చూడ్డానికే ధియేటర్స్‌కి వస్తున్నారంటే ఆమె గ్లామర్‌కున్న క్రేజ్‌ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అలాగనీ బికినీలో నటించడం వల్ల హద్దులు మీరి గ్లామర్‌ ఒలకబోసేయడం కాదంటోంది ముద్దుగుమ్మ కేథరీన్‌. సినిమాకి అవసరమైనంత వరకే తాను గ్లామర్‌ పండిస్తాననీ అంతకు మించి ఓవర్‌ చేయననీ అంటోంది. ఇంతకు ముందూ అలాగే నటించాను. ఇకపై కూడా అలాగే నటిస్తానంటోంది. ఏదేమైనా ఈ హాట్‌ బ్యూటీ హాట్‌ షోతో 'గౌతమ్‌నంద' సినిమాకి ఎక్స్‌ట్రా గ్లామర్‌ టచ్‌ వచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS