అప్పుడు 'జై' పాత్రలో ఎన్టీఆర్‌ని చూశాం. చాలా ఇంప్రెస్ చేశాడు 'జై'గా ఎన్టీఆర్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అది. 'ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల, ఈ రావణున్ని సంపాలంటే సముద్రమంత ద..ద..ద..'ధైర్యం' ఉండాల' అంటూ కొంచెం నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ మరో క్యారెక్టెర్ ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇదే లవ కుమారుడి క్యారెక్టర్ గెటప్. చాలా క్లాస్‌గా ఉంది. నీట్ షేవ్‌తో, టక్ చేసుకుని చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్ ఈ గెటప్‌లో. అంటే ఈ క్యారెక్టర్ చాలా సున్నితంగా ఉండబోతోందని తెలియ వస్తోంది. ఈ గెటప్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ మూడు గెటప్స్‌లో రెండు గెటప్స్ వచ్చేసినట్లే. ఇక ఆ మూడో గెటప్ 'కుశ' కూడా త్వరలోనే రివీల్ కానుంది. ఆ గెటప్ ఎలా ఉండబోతోందనే ఆశక్తి అభిమానుల్లో ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జై లవ కుశ' సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో పక్క ఎన్టీఆర్ బుల్లితెర ద్వారా ప్రతీ వారంలోనూ రెండు రోజులు అభిమానులతో సందడి చేస్తున్నాడు. 'జై లవ కుశ' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.