పక్కింటబ్బాయిలా వెండితెరపై సందడి చేసిన నాని ఇప్పుడు మనింటబ్బాయిలా మన నట్టింట్లోకే వచ్చేయడానికి సిద్ధమైపోతున్నాడు. చూసి పండగ చేసుకునేందుకు ప్లేట్ నిండా పకోడీలతో, కూల్ డ్రింక్ బాటిల్స్‌తో టీవీల ముందు సెటిలైపోయేందుకు సిద్ధమైపోండిక. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా గతేడాది బుల్లితెర ప్రేక్షకుల్ని మంత్ర ముగ్థుల్ని చేసిన మెగా గేమ్ షో 'బిగ్‌బాస్' సీజన్ 2 కి నానిని వ్యాఖ్యాతగా ఎంచుకున్నారన్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ నాని 'బిగ్‌బాస్' షూటింగ్ సెట్‌లో సందడి చేస్తున్నాడనీ తెలుస్తోంది. కొన్ని ట్రైల్ షూట్స్ ఆల్రెడీ జరిగాయట. త్వరలోనే ఆ వీడియోలు రిలీజ్ చేయనున్నారట. వరుస విజయాలతో దూకుడు ప్రదర్శించిన నాని సక్సెస్‌కి 'కృష్ణార్జున యుద్ధం'తో చిన్న బ్రేక్ తగిలిందని చెప్పాలి. తాజాగా నాగార్జునతో మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు నాని. ఓ పక్క సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరో పక్క 'బిగ్‌బాస్' కోసం టైమ్ వ్యత్యిస్తున్నాడట నాని.
ప్రోమోస్ కోసం ఫన్నీ ఫన్నీ వీడియోలు చాలా వరకూ షూట్ చేస్తున్నారట. అందులోనూ ఈ సారి 'బిగ్‌బాస్' షోలో కేవలం సెలబ్రిటీసే కాకుండా, కామన్ పీపుల్‌కి కూడా చోటు దక్కడంతో, ఈ 'బిగ్‌బాస్' షో మరింత విజయవంతం కానుందనీ, ఎంటర్‌టైనింగ్ టాలెంట్ ఉన్న కామన్ పీపుల్‌ని ఈ గేమ్ షో కోసం ఎంచుకునే యోచనలో బిగ్‌బాస్ టీమ్ ఆల్రెడీ సెర్చింగ్ మొదలెట్టేసిందనీ సమాచారమ్.
మరోపక్క ఈ షోని గుర్తు చేస్తూ, 'బిగ్‌బాస్' సీజన్ 1లోని హాట్ హాట్ గ్లామర్ పార్టిసిపెంట్ అయిన దీక్షా పంత్‌తో ఓ హాట్ వీడియో ఆల్రెడీ బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.