బాలయ్య - బోయపాటి కాంబినేషన్ మూవీలో హీరోయిన్ దొరకడం మహా కష్టమైపోయింది. 'రూలర్' కోసం ఎలాగో ఇద్దరు భామలు దొరికేశారు. కానీ, ఎందుకో తాజా సినిమాకి హీరోయిన్ దొరకడం చాలా కష్టమైపోతోందట. బాలీవుడ్ భామని తీసుకురావాలని చాలా ప్రయత్నించారట. కానీ, కుదరలేదు. దాంతో, టాలీవుడ్ భామలకే గాలమేయక తప్పలేదట. ఆ కోవలో బోయపాటికి సెంటిమెంట్ అయిన కేథరీన్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ తాజా సమాచారం. ఇంతవరకూ కేథరీన్‌కి సెకండ్ హీరోయిన్ ఛాన్సెసే ఎక్కువ. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్‌తోనూ సరిపెట్టుకుంది. కానీ, ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రేంజ్ కట్టబెట్టాడట బోయపాటి.
ఛాన్స్ దొరికింది కదా అని, కేథరీన్ బోయపాటిని బాగా వాడేసిందట. బాలయ్య పక్కన హీరోయిన్‌గా నటించాలంటే, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఎంతైనా ఇచ్చి కేథరీన్‌నే హీరోయిన్‌గా ఫైనల్ చేసేందుకు నిర్మాతల్ని బోయపాటి కన్విన్స్ చేస్తున్నారంటే, బాలయ్యకు హీరోయిన్ దొరకడం ఎంత కష్టంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైతేనేం, ఈ రెమ్యునరేషన్ వ్యవహారం నిజమే అయితే, మొత్తానికి కేథరీన్ తన్నితే బాలయ్య బుట్టలో పడిందన్న మాటే. ప్రస్తుతం 'రూలర్' రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు చూస్తున్నారు.