రాజ్‌తరుణ్‌ - షాలినీ ఎక్కడో టచ్‌ చేశారుగా.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన 'ఇద్దరి లోకం ఒక్కటే' చిత్రం ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. మొదట్నుంచీ ఈ సినిమాపై రాజ్‌తరుణ్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. తనకు సెంటిమెంట్‌ అయిన డిశంబర్‌ 25న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు. ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమవుతుందని, ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న హిట్‌ తన సొంతమవుతుందని రాజ్‌ తరుణ్‌ భావిస్తున్నాడు. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ విషయానికి వస్తే, 'ఇద్దరి లోకం ఒక్కటే' హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ అని ట్రైలర్‌ ద్వారా క్లియర్‌ అయిపోయింది.

ట్రైలర్‌ ఎండ్‌ చేసిన విధానం నాగార్జున నటించిన 'గీతాంజలి' మూవీని గుర్తు చేసింది. ఆధ్యంతం ట్రైలర్‌లో రాజ్‌ తరుణ్‌ - షాలినీ పాండే మధ్య లవ్‌ ట్రాక్‌ని చూపించారు. చిన్నప్పటి రిలేషన్‌ షిప్‌, మధ్యలో బ్రేకప్‌, లాంగ్‌ టైమ్‌ నిరీక్షణ, మళ్లీ చిగురించిన లవ్‌.. సేడ్‌ క్లైమాక్స్‌ అని నాలుగు ముక్కల్లో సినిమా స్టోరీ మొత్తం రివీల్‌ చేసేశారు. అయితే, సినిమాకి రాజ్‌ తరుణ్‌ - షాలినీ పాండే నటన హైలైట్‌ అవ్వనుందని ట్రైలర్‌ ద్వారా అర్ధమవుతోంది. మొత్తానికి 'ఇద్దరి లోకం ఒక్కటే' బరువైన లవ్‌ స్టోరీ అని తెలుస్తోంది. దిల్‌ రాజు సమర్పణలో జి.ఆర్‌.కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS