టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం మొత్తం టాలీవుడ్‌నే కుదిపేస్తోంది. ఈ ఇష్యూకి సంబంధించి, పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ పేర్లని తాము అధికారికంగా ప్రకటించలేదనీ, ఎక్జైజ్ శాఖ అధికారి అకున్ సబర్వాల్ ప్రకటించారు. కానీ మీడియా అత్యుత్సాహంతో సదరు సినీ ప్రముఖులు ఈ విషయమై ఇప్పటికే మీడియా ముందుకొచ్చి, తమని అనవసరంగా ఈ రొంపిలోకి లాగొద్దనీ మీడియాని వేడుకుంటున్నారు. ఈ ఇష్యూకి సంబంధించి, తమ తమ అభిప్రాయాలను తెలియపరిచారు పలువురు నటులు. నటుడు సుబ్బరాజు తనకు నోటీసు అందిందనీ, అయితే ఎందుకు తనకి ఈ నోటీసు వచ్చిందో అర్ధం కావడం లేదనీ తెలిపారు. తనీష్ అయితే చాలా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి సఫర్ అవుతున్నారనీ దయచేసి తమ పేర్లు పదే పదే పాయింట్ చెయ్యొద్దనీ మీడియాని రిక్వెస్ట్ చేశాడు. నవదీప్ కూడా ప్రొఫిషన్‌లో భాగంగా ఈ నేరానికి పాల్పడే వ్యక్తితో పరిచయం ఉంది, అంతేకానీ, ఆ నేరంతో తనకెలాంటి సంబంధం లేదనీ అన్నాడు. ఆయన దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన ఆ నేరానికి తాను పాల్పడినట్లు ఎలా నిరూపిస్తారనీ ప్రశ్నించాడు. మా అసోసియేషన్ కూడా ఈ విషయంపై సీరియస్‌గానే స్పందించింది. సినీ పరిశ్రమపై బురద చల్లొద్దనీ, అందుకు పాల్పడిన వారి పేర్లు మాత్రమే బయట పెట్టాలనీ చెప్పింది. అలాగే విచారణ సంస్థలు నిందితులు ఎవరో కరెక్ట్‌గా తేల్చకుండానే ఇలాంటి గాసిప్స్‌ని మీడియా ప్రచారం చేయడం మంచిది కాదనీ తెలిపింది.