హీరో నిఖిల్ తాజాగా తాను ప్రేమించిన అమ్మాయి పల్లవీ వర్మని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. నిఖిల్ కి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇంతకీ తేజు ఏం ట్వీటాడంటే, ‘ఇండస్ట్రీలో మరో వికెట్ డౌన్.. జీవితంలో అత్యున్నతమైన అడుగు వేశావు.. ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే నిండాలి..‘ అంటూ పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
తేజు ట్వీట్ కి బదులిస్తూ నటుడు బ్రహ్మాజీ.. వికెట్స్ పడుతూ ఉంటే పండగ చేసుకుంటున్నావా తేజూ.. ఆ తప్పు నువ్వు చేయకు దొరికిపోతావ్..‘ అన్నాడు. అందుకు తేజు ‘భయమేస్తోంది భాజీ..’ అంటూ బదులిచ్చాడు. ఇలా నిఖిల్ పెళ్లిపై వీరిద్దరి సరదా సంభాషణా నెట్టింట్లో వైరల్ గా మారింది. మరోవైపు, తేజుకి తొందరగా పెళ్లి చేసేయాలంటూ ఆయన ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవికి సూచిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. మనోడేమో ప్రస్తుతం ’సోలో బతుకే సో బెటర్‘ అంటున్నాడు. అదేమంటారా.? తేజు ప్రస్తుతం ’సోలో బతుకే సో బెటరు‘ సినిమాలో నటిస్తున్నాడు కదండీ. అదే. కొత్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, ఇస్మార్ట్ భామ నభా నటేష్, తేజుకి జోడీగా నటిస్తోంది.