లాక్ డౌన్ వేళ ఆర్జీవీ గిఫ్ఠ్ చూశారా.?

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలనానికి తెర లేపారండోయ్. ఆయన డైరెక్షన్లో తాజాగా ’క్లైమాక్స్‘ అను చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమా కథా కమామిషు ఏంటీ.? షూటింగ్ ఎంతవరకూ వచ్చింది.? అనే ప్రశ్నలు అటుంచితే, లాక్డౌన్ వేళ ఈ సినిమా నుండి ఓ స్టన్నింగ్ టీజర్ రిలీజ్ చేశారు మన వర్మ గారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి మొదటగా గుర్తు చేసుకోవాలండోయ్. అప్పట్లో ‘జీఎస్ టీ (గాడ్స్ సెక్స్ అండ్ ట్రూత్) ’ అనే సినిమాని తెరకెక్కించి వివాదాస్పదమయ్యారు కదా.. మన వర్మ గారు.. ఆ సినిమాలో బోల్డ్గ్ గా నటించిన పోర్న్ స్టార్ మియా మల్కోవాతోనే మళ్లీ ఈ సినిమా తెరకెక్కించారు వివాదాల రామ్ గోపాల్ వర్మగారు.

 

టీజర్ విషయానికి వస్తే పక్కాగా వర్మగారి స్టైల్లో ఉందీ టీజర్. ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారట. ఆ లోగా వదిలిన టీజర్ విషయానికొస్తే, మియా మల్కోవా అంగాంగ ప్రదర్శనను ఘాటుగా చూపించారు. టీజర్ చూస్తుంటే ఇదో థ్రిల్లర్ కథనీ తెలుస్తోంది. మిగిలిన వివరాలు తెలియాలంటే, 18 వరకూ అంటే ట్రైలర్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే. మొత్తానికి లాక్డౌన్ వేళ మియా మల్కోవాతో సడెన్ ఎంట్రీ ఇచ్చి రామ్ గోపాల్ వర్మ ఆడియన్స్ కి భలే షాకిచ్చారులే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS