బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ గ్లామర్ ఒలకబోయడమే కాదు. మాతృమూర్తిగానూ తన మానవత్వాన్ని చాటుకుంటోంది. గతంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. మళ్లీ రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యింది. సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ బాలీవుడ్‌లో ఆదర్శమైన జంట. ఈ ఇద్దరి వివాహ అనుబంధానికి ప్రతీకగా గతంలో ఇద్దరు కవల పిల్లలు జన్మించగా, ఇటీవలే మళ్లీ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది సెలీనా జైట్లీ. అయితే పుట్టిన అతి కొద్ది రోజుల్లోనే ఆ కవలల్లో ఒక బాబు గుండెకు సంబంధించిన సమస్యతో మరణించడం జరిగింది. ఈ విషయం ఆ జంటని చాలా బాధకి గురి చేసింది. పుట్టిన బిడ్డలకు ఆర్ధర్, సంషేర్ అని నామకరణం చేసుకున్నారు సెలీనా దంపతులు. అయితే వారిలో సంషేర్ మరణించడం జరిగింది. హీరోయిన్స్ పిల్లన్ని కంటే తమ గ్లామర్ పాడైపోతుందనీ, బాడీ షేప్ తప్పుతుందనే అపోహలతో ఉంటారు. కానీ వాటన్నింటికీ భిన్నంగా సెలీనా జైట్లీ రెండు సార్లు కవల పిల్లలకి జన్మనిచ్చి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ని ఎక్కడా మిస్ చేయలేదు. ప్రెగ్నెన్సీతోనే హాట్ హాట్ ఫోటో సెషన్స్ చేయించుకుని సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉండేది. యోగాసనాలు వేస్తూ, ప్రెగ్నెన్సీలో టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఇతరత్రా హెల్త్ టిప్స్‌ని పాస్ చేస్తూ ఉండేది. అందుకే సెలీనా ఆటిట్యూడ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. రియల్లీ హ్యాట్సాఫ్ టు యు సెలీనా!