శ్రీదేవి నటించిన 'మామ్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. తల్లి, కూతురి మధ్య సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. . ఓ సగటు తల్లి ఆవేదన ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారట. ఈ విషయం ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ చాలా పాజిటివ్‌గా ఉంది. శ్రీదేవి జాతీయ స్థాయి ఉత్తమ నటిగా అవార్డు అందుకునేంతటి గొప్ప నటన ప్రదర్శించిందని సమాచారమ్. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ 'మామ్' సినిమాని ఏకంగా న్యూ ఏజ్ మదర్ ఇండియా అని కితాబులిచ్చారంటే సినిమా ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అనీ, ప్రతి తల్లీ సినిమా చూసి చాలా భావోద్వేగానికి గురవుతుందని అంటున్నారు. జులై 7న 'మామ్' ప్రేక్షకుల్ని పలకరించనుంది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీదేవికి 300వ సినిమా ఇది. దాంతో బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. అక్షయ్‌ఖన్నా, అభిమన్యుసింగ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది 'మామ్'.