విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని ఫ్యామిలీ మూవీగా రూపొందిన ‘మనం’ ఓ అద్భుత కావ్యంగా అభివర్ణించవచ్చు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా, ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన ఉన్నతమైన బహుమతి.. అంటూ ఇలా రకరకాలుగా ఈ సినిమాకి సంబంధించి గొప్పగా మాట్లాడుకోవచ్చు. ఆ ఫార్ములాలో గతంలో కొన్ని సినిమాలొచ్చినా ఈ జనరేషన్‌లో అదో అద్భుతం అంతే. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవల్సి వస్తుందంటే, ఇదే ఫార్మేట్‌లో విక్రమ్ కుమార్ మరో సినిమా తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడట.
ఆ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడట. ‘మనం’ ఫార్మేట్ ప్రకారం మరి, సీనియర్ క్యారెక్టర్స్ పోషించే నటులెవరో తెలీదు కానీ, ప్రస్తుతానికి ఈ టాక్ ఇంట్రెస్టింగ్‌గా ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ఈ ప్రాజెక్ట్ ఓ వెబ్ సిరీస్ అనే టాక్ కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తాడట. అయితే ఇది సినిమానా.? వెబ్ సిరీస్‌నా.? అనే క్లారిటీ రావాలంటే, చైతూ గానీ విక్రమ్ గానీ రెస్పాండ్ అవ్వాల్సిందే