కరోనా కారణంగా రేపు అనగా మార్చి 25 అనే తేదీన అందరూ సరదాగా కలిసి మెలిసి జరుపుకునే ‘ఉగాది’ అనే పండగ ఒకటి ఉందన్న సంగతే మర్చిపోయారంతా. ఒకవేళ గుర్తున్నా, ఆ పండక్కి ఎవరినీ ఎవరూ ఇంటికి ఆహ్వానించలేని పరిస్థితి. ఎవరి ఇంటికీ వెళ్లలేని పరిస్థితి అయితే, ఆహ్వానించకుండానే ఓ అతిథి మనతో కలవనున్నారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. అదేంటీ మెగాస్టార్ చిరంజీవి మనతో ఎలా కలుస్తారు.. అనుకుంటున్నారా.? అయితే మీకీ అప్‌డేట్ తెలియాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తన అభిప్రాయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకోనున్నారు. ఫ్యాన్స్‌కి కొన్ని సూచనలు సహాలూ ఇవ్వనున్నారు.
తన అభిప్రాయాల్ని షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియాని ఓ వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటున్నానని చిరంజీవి తాజాగా ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ ఉగాది నుండే అంటే, మార్చి 25 నుండి రెగ్యులర్‌గా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండనున్నారు. కరోనా కారణంగా స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ యావత్ దేశం లాక్ డౌన్ లో వున్న ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి గొప్ప ఆఫర్ ఇస్తే ఫ్యాన్స్‌కి అంత కన్నా కావల్సిందేముంది. అందుకే ఈ ఉగాది వెరీ వెరీ స్పెషల్ ‘మెగా సోషల్’ ఎంట్రీతో.