లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఛల్ మోహన్‌రంగా' సినిమాకి త్రివిక్రమ్ కథనందించిన సంగతి తెలిసిందే. అందుకే 'ఛల్ మోహన్‌రంగా' సినిమాలో త్రివిక్రమ్ ఫ్లేవర్ బాగా పండింది. సినిమా సూపర్ హిట్ అని చెప్పలేం కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఓకే అనిపిస్తోంది. దాంతో త్రివిక్రమ్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుయ్యింది.
త్రివిక్రమ్ ఊపిరి పీల్చుకోవడమేంటా అనుకుంటున్నారా? అవును మరి త్రివిక్రమ్‌కి 'అజ్ఞాతవాసి' ఇచ్చిన ఎఫెక్ట్ అలాంటిది. ఆ తర్వాత వచ్చిన ఈ సినిమాకి బెటర్ రెస్పాన్స్ వస్తుండడంతో త్రివిక్రమ్ అలా ఫీలవుతున్నాడట. త్రివిక్రమ్ గతంలో కొట్టిన సక్సెస్‌లతో పోల్చితే ఈ సక్సెస్ అంత చెప్పుకోదగ్గది కాదు కానీ, 'అజ్ఞాతవాసి' భారీ ఫెయిల్యూర్‌తో త్రివిక్రమ్ మార్కు కథా ప్రతిభ ఈ సినిమాలో కనిపించడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాడనీ తెలుస్తోంది.
ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌లో రూపొందించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగులతో కూడిన కామెడీకి చైతన్య స్క్రీన్‌ప్లే చక్కగా కుదిర్చాడు. మొత్తానికి ఈ సినిమా హీరో నితిన్‌తో పాటు, త్రివిక్రమ్‌ని కూడా గట్టున పడేసినట్లే అయ్యింది. 'లై'తో నిరాశ పరిచిన నితిన్ అంతకు ముందు కొట్టిన 'అ,ఆ' రేంజ్ హిట్ కాకపోయినా, ఓకే అనిపిస్తున్నాడు 'ఛల్ మోహన్‌రంగా' సినిమాతో.
మొత్తానికి పవన్ కళ్యాణ్ బ్యానర్‌లో రూపొందినందుకు రికార్డులైతే కొల్లగొట్టలేదు కానీ, పరువు నిలబెట్టిన సినిమాగా 'ఛల్ మోహన్‌రంగా'ని లెక్కల్లో వేసేయొచ్చులెండి.