హ్యాండ్సమ్ గై గోపీచంద్ తాజా చిత్రం 'చాణక్య'. తమిళ డైరెక్టర్ తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. హైద్రాబాద్ శివారు ప్రాంతాల్లో 'చాణక్య' షూటింగ్ జరుగుతోంది. కాగా, దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుందట. ఇక పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి కానుందట.
పాటల కోసం 'చాణక్య' టీమ్ విదేశాలకు ఫ్లై అవ్వనుందనీ సమాచారమ్. కథ విషయానికి వస్తే, స్పై థ్రిల్లర్ కథాంశంతో విభిన్నంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందట. గోపీచంద్‌కి జోడీగా హనీ ఈజ్ ద బెస్ట్ మెహ్రీన్ నటిస్తోంది. గోపీచంద్ గత చిత్రం 'పంతం'తో నిరాశపరిచాడు. ఆ మాటికొస్తే, 'జిల్' తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు గోపీచంద్‌కి. 'చాణక్య' ఆ స్థాయి హిట్ ఇచ్చే సినిమా అవుతుందంటున్నారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి కాగానే సినిమా రిలీజ్ డేట్ కన్‌ఫామ్ చేయనున్నారనీ తాజా సమాచారమ్.
ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ వదిలారు. గెడ్డం, కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్‌తో పక్కనే ఉన్న జీపుకు జారబడి స్వీట్ స్మైల్ ఇస్తూ, హ్యాండ్‌సమ్ గోపీచంద్ స్టైల్‌గా పోజిచ్చాడు ఈ పోస్టర్‌లో. ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే, 'చాణక్య' పేరు వినగానే ఎత్తుకు పైఎత్తులు వేసే నాటి చాణక్యుడే గుర్తొస్తాడు. ఆ పేరును టైటిల్‌గా పెట్టారంటే ఈ సినిమా ఖచ్చితంగా సమ్‌థింగ్ డిఫరెంట్ అనే అనుకోవాలి. ఏమో చూడాలి మరి, 'చాణక్య'తోనైనా గోపీచంద్ ఆకట్టుకుంటాడో లేదో.!