ఆరడుగుల హ్యాండ్‌సమ్ గోపీచంద్ 25 వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం 'చాణక్య'. తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ లుక్స్ సూపర్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటున్నాయి. లైట్ గెడ్డంతో కనిపిస్తున్నాడు. హీరోయిన్‌గా మెహరీన్ నటిస్తోంది. బాలీవుడ్ భామ జరీన్‌ఖాన్ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కీలక పాత్ర పోషిస్తోంది. లేటెస్ట్‌గా విడుదల చేసిన టీజర్‌లో ఫుల్ ఆఫ్ యాక్షన్ చూపించారు. హీరో గోపీచంద్‌తో పాటు, గన్నులు పట్టుకుని జరీన్ ఖాన్ కూడా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తోంది. మెహ్రీన్ గ్లామర్ యాంగిల్ మాత్రమే చూపించారు.
'మనం రెండు రకాల జీవితాలు లీడ్ చేస్తున్నాం.. ఒకటి నిజం. ఇంకోటి అబద్ధం..' అంటూ గోపీచంద్ ఎవరితోనో చెబుతున్నట్లుగా టీజర్ స్టార్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత యాక్షన్ బిగిన్స్.. 'పంతం' సినిమా తర్వాత గోపీచంద్ నటిస్తున్న చిత్రమిది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న గోపీచంద్‌కి 'చాణక్య' యాక్షన్ అయినా కలిసొస్తుందో లేదో చూడాలి మరి. దసరాకి సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.