ఎన్టీఆర్‌ కన్నా ముందే చంద్రబాబు బయోపిక్‌.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో బయోపిక్స్‌ హవా నడుస్తోంది. బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మరో వైపు దివంగత నేత వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ని 'యాత్ర' పేరుతో తెరకెక్కిస్తున్నారు. మహి. వి. రాఘవ ఈ బయోపిక్‌ని రూపొందిస్తున్నారు. 

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ పాత్రలో నటిస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ కూడా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌ తెరపైకి వచ్చింది. ఈ బయోపిక్‌ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్‌ అయ్యింది. అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది కూడా. 'చంద్రోదయం' టైటిల్‌తో ఈ బయోపిక్‌ని రూపొందిస్తున్నారు. 

నువ్వుల వినోద్‌ చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నారు. టి. వెంకటరమణ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. జి.జె.వి.కె.రాజేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం షూటింగ్‌ని వీలైనంత త్వరలో పూర్తి చేసి అక్టోబర్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉంది. 

కాగా లేటెస్టుగా విడుదలైన చంద్రబాబు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆశక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ నేతగా చంద్రబాబు ఎదిగిన తీరు, ప్రజల మనిషిగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఒడుదుడుకుల్ని 'చంద్రోదయం' సినిమా ద్వారా ఆశక్తికరంగా తెరకెక్కించనున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS