ఎన్టీఆర్ బయోపిక్ ని ఆర్జీవీ డైరెక్ట్ చేయనున్నాడు అని తెలిసాక ఇప్పుడు అందరి కళ్ళు ఆ చిత్రం పైనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఏమిటంటే- చంద్రబాబు నాయుడి పాత్ర ఈ కథలో ఎలా చూపించనున్నారు? ఒక వేళ చూపించినా.. అది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్నలు.
కాని తెలియవస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభం నుండి ఆయన రాజకీయ పార్టీ మొదలుపెట్టి ముఖ్యమంత్రి అయ్యేవరకే ఉంటుందట.
దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడి పాత్ర ఈ చిత్రంలో ఉండదు అని తెలుస్తుంది.