క‌ల‌సి రాని.. క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌

మరిన్ని వార్తలు

ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ప‌డితే చాలు...అనుకుంటున్న ద‌ర్శ‌కుల‌లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఒక‌డు. ఉత్త‌మాభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగా, క్రియేటీవ్ ద‌ర్శ‌కుడిగా త‌న‌కు మంచి పేరుంది. అయితే...త‌న సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. మంచి సినిమా తీశారు అనే పొగడ్త‌లు వ‌చ్చినా - క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ దొర‌క్క‌పోవ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మే. అందుకే ఈసారి క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కొట్టాల‌ని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి బాగా ఫిక్స‌య్యాడు. అందులో భాగంగా తీసిన సినిమా `చెక్‌`.

 

ఈ సినిమాతో త‌న‌లోని క‌మ‌ర్షియ‌ల్ ప‌వ‌రేంటో చెప్పాల‌నుకున్నాడు. కానీ ఈ ప్ర‌యోగం సైతం విక‌టించింది. శుక్ర‌వారం విడుద‌లైన ఈసినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. చందూ నుంచి రావ‌ల్సిన సినిమా అయితే కాద‌ని, విమ‌ర్శ‌కులు తేల్చేశారు. అంతేనా..? కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టాడ‌ని రుజువ‌ల‌తో స‌హా చూపిస్తున్నారు. త‌న క్రియేటివిటీ గాలికి వ‌దిలేసి, ఇలా ప‌రాయి సినిమాల‌పై ఆధార‌ప‌డ‌డం... చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని విష‌యం. ఇటు త‌న క్రియేటివిటికి, అటు త‌న‌ది కాని క‌మ‌ర్షియాలిటీకి దూరంగా ఈ సినిమా తీశాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చేయ‌క చేయ‌క ఓ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌య‌త్నం చేస్తే.. ఆ ప్ర‌యోగం ఇలా బెడ‌సి కొట్టిందేమిటి? అంటూ చందూ బాధ ప‌డుతున్నాడ‌ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS