చరణ్‌ ఖాతాలో ఆ రీమేక్‌ చేరుతుందా?

మరిన్ని వార్తలు

జయం రవి ప్రధాన పాత్రలో వచ్చిన 'తనీఒరువన్‌'ని తెలుగులో 'ధృవ' పేరుతో రీమేక్‌ చేసి, మంచి విజయం అందుకున్నాడు. 'ధృవ' తర్వాత 'రంగస్థలం'తో సంచలన విజయం అందుకుని, ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తండ్రి చిరంజీవితో 'లూసిఫర్‌' అనే మలయాళ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాల్సి ఉంది. ఇక ఇప్పుడు తాజాగా రామ్‌ చరణ్‌ లిస్టులోకి 'అసురన్‌' రీమేక్‌ వచ్చి చేరింది. అయితే, చరణ్‌ నుండి ఈ విషయంలో ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు.

 

కానీ, చరణ్‌కి 'అసురన్‌' మూవీ చాలా బాగుంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. తమిళంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, 100 కోట్ల గ్రాస్‌ని దాటి, స్టిల్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న సినిమా 'అసురన్‌'. రియలిస్టిక్‌ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో ధనుష్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాలో తన నటనకు ధనుష్‌ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

 

లేటెస్ట్‌గా మన సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌ ఒపీనియన్‌ ప్రకారం చరణ్‌ ఈ రీమేక్‌పై ఇంట్రెస్ట్‌ చూపిస్తాడా.? ఒకవేళ చరణ్‌ టేకప్‌ చేస్తే ఈ ప్రాజెక్ట్‌ స్వరూపం మారిపోనుందా.? చరణ్‌ కోసం కాక, మెగా కాంపౌండ్‌లో వరుణ్‌ లాంటి యంగ్‌ హీరోల కోసమైనా ఈ రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకునే అవకాశముందా.? వేచి చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS