త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు, మాటల మాంత్రికుడే కావొచ్చు. కాకపోతే... తనపై కాపీ మరక ఉంది. హాలీవుడ్ సినిమాల్లోని లైన్లు, సీన్లు తెలివిగా లేపేస్తాడని పెద్ద టాక్. అది నిజం కూడా. తన తొలి సినిమా నుంచి మొన్నటి అజ్ఞాతవాసి వరకూ కాపీ మరక స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు `అల వైకుంఠపురములో` కూడా కాపీకి అతీతం కాదని తేలిపోయింది. ఈ సినిమా నుంచి రెండో పాట నిన్ననే విడుదలైంది. `రాములా.. రాములా` అంటూ మంచి మాస్ బీట్తో సాగే పాట ఇది. అయితే ఇదో ప్రైవేటు ఆల్బమ్ నుంచి ఎత్తుకొచ్చిన పాయింటు.
`రాములా.. రాములా` అంటూ తన ప్రియుడిపై ఇష్టంగా నిందులేస్తూ.. ఓ ప్రేయసి పాడుకునే ప్రైవేటు గీతం. దాన్ని కాసర్ల శ్యామ్ కాస్త సినిమాటిక్‌గా మార్చుకున్నాడు. ఈ రెండు పాటలూ ఒక్కసారి వింటే కచ్చితంగా పోలికలు కనిపిస్తాయి. దాంతో ఇది కాపీ పాట అని సోషల్ మీడియాలో అప్పుడే ఆగం మొదలైపోయింది. కాకపోతే రాములా పూర్తి పాట ఇంకా రాలేదు కాబట్టి అంత వరకూ కాస్త వెయిట్ చేయడం మంచిది.