మొన్న శృతిహాసన్, తమన్నాని పెళ్లి చేసుకుంటానంది. ఇప్పుడేమో ఛార్మి, త్రిషను పెళ్లి చేసుకుంటానంటోంది. ఇదేం పెళ్లి గోలరా బాబూ! అని వారి వారి అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అసలు మ్యాటరేంటంటే, ఛార్మి, త్రిష మంచి స్నేహితులు. వీరి స్నేహం ఇప్పుడు పెళ్లి దాకా చేరిందనుకుంటా. ఈ రోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రిషకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ పోటెత్తుతున్నాయి. అందులో ఛార్మి అందించిన విషెస్ ఆశక్తికరంగా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 'బేబీ ఐ లవ్ యూ టుడే అండ్ ఎవర్..' అంటూ త్రిషకు ఛార్మి స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ పోస్ట్ చేసింది.
ఉత్తి విషెసే కాదండోయ్, పెళ్లి చేసుకుందాం ఇది ఇప్పుడు చట్టబద్ధం కూడా అంటూ ఓ రింగ్ బొమ్మను పోస్ట్ చేసింది. అంతేకాదు, మోకాలిపై నిలబడి త్రిషకు ప్రపోజ్ చేస్తూ ఆమె రిప్లై కోసం ఎదురు చూస్తోందట ఛార్మి. అంతేకాదు ఛార్మి పోస్ట్ చేసిన ఇంకో ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఛార్మికి త్రిష గాఢంగా ముద్దు పెడుతోన్న ఫోటో అది. సిట్యువేషన్‌కి సరిగ్గా సరిపోయింది. ఏది ఏమైతేనేం భలే ఫన్నీగా ఉంది కదా. ఈ మధ్య ఇలాంటి ఫన్నీ విషెస్ ఎక్కువైపోయాయ్ మరి ఏం చేస్తాం. ఇకపోతే త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఛార్మి ప్రస్తుతం నటనకు దూరమై, దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఛార్మి నిర్మాణ భాగస్వామ్యంలో ప్రస్తుతం 'రొమాంటిక్', 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలు రూపొందుతున్నాయి.