బూతు బాక్సాఫీస్‌ని బలోపేతం చేస్తుందా? ఏమో..అవునేమో. ఎందుకంటే, కొన్ని సినిమాలు ఈ బూతు నేపథ్యంలోనే వచ్చి, మంచి కమర్షియల్ విజయాల్ని అందుకున్నాయి. ఆ లిస్టులో 'అర్జున్‌రెడ్డి', 'ఆర్‌ఎక్స్ 100' తదితర సినిమాలుంటాయి. అయితే, అవి కేవలం బూతు నేపథ్యంలో మాత్రమే వచ్చినవి కాదు. కొంత బోల్డ్ కంటెంట్, ఇంకాస్త ఎమోషన్ దానికి తోడు కొంచెం క్రియేటివిటీ ఇవన్నీ కలగలిసినవి కాబట్టే 'అర్జున్‌రెడ్డి', 'ఆర్‌ఎక్స్ 100' విజయాల్ని అందుకున్నాయి. కానీ, ఇంకొన్ని సినిమాలు బూతు లోతుల్ని చూపించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఆ లిస్టులోనే 'డిగ్రీ కాలేజ్' చేరుతుందేమో.
ఈ సినిమాలో వల్గారిటీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ట్రైలర్ చూస్తేనే దాదాపుగా విషయం అర్ధమైపోతోంది. బూతు సన్నివేశాలకు తోడు, బూతు డైలాగులు ట్రైలర్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. నరసింహ నంది ఈ సినిమాకి దర్శకుడు. '1940లో ఒక గ్రామం', 'లజ్జ', 'కమలతో నా ప్రయాణం' వంటి రియలిస్టిక్ సినిమాలు తీసిన దర్శకుడి నుండి ఇలాంటి సినిమా రావడం, ఆశ్చర్యకరమే. సెక్స్ యాంగిల్స్‌లో పీహెచ్‌డీ చేయించేసేలా ఉంది ట్రైలర్. మరి ఈ బోల్డ్ సినిమా బోలెడన్ని వసూళ్లు సాధిస్తుందా? వేచి చూడాలిక.