రకుల్‌ లైఫ్‌ పాట్నర్‌ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు

తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ ఛైర్‌ని అధిరోహించినట్లే అధిరోహించి పక్కకు జరిగిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ప్రస్తుతం హిందీలో సత్తా చాటేందుకు రకుల్‌ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి లేటు వయసున్న వ్యక్తికి ప్రియురాలిగా నటించేందుకు కూడా ఒప్పేసుకుంది. ఏది ఏమైతేనేం ఈ ప్రయోగమైనా రకుల్‌కి ఫలిస్తుందో లేదో చూడాలి మరి. ఇక అసలు విషయానికి వస్తే, రకుల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో 'దే దే ప్యార్‌ దే' సినిమాలో నటిస్తోంది.

 

ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటోన్న రకుల్‌కి వింత ప్రశ్న ఎదురైంది. రీల్‌ లైఫ్‌లో మాదిరి రియల్‌ లైఫ్‌లో కూడా జరిగితే ఒప్పుకుంటారా? అంటే, దానికేముంది ప్రేమకు వయసుతో సంబంధం లేదని సింపుల్‌గా తేల్చేసింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. రకుల్‌ చెప్పిన ఈ మాట ఇప్పుడు అన్నింటా చర్చనీయాంశమైంది. అవును నిజమే ప్రస్తుతం సెలబ్రిటీలు తమ లైఫ్‌ పాట్నర్స్‌ వయసును అస్సలు పట్టించుకోవడం లేదు, ప్రియాంకా చోప్రా తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవల కోలీవుడ్‌ భామ సాయేషా సైగల్‌ కూడా తన కన్నా వయసులో చాలా పెద్దవాడైన ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మలైకా - అర్జున్‌కపూర్‌, తదితర ప్రేమ జంటలు వయసును పక్కన పెట్టేసి, లైఫ్‌ని సూపర్బ్‌గా ఎంజాయ్‌ చేసేస్తున్నారు. అలాగే రకుల్‌ కూడా లైఫ్‌లో మంచి వ్యక్తి తనకు పాట్నర్‌గా దొరికొతే, వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా పెళ్లి చేసుకుంటానన్న తన అభిప్రాయన్ని బయటపెట్టింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌ అనీ, కెరీర్‌ని మాత్రమే ప్రేమిస్తున్నాననీ చెప్పుకొచ్చింది హాట్‌ హాట్‌ రకుల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS