లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వల్ల.. ఎంత నష్టం వచ్చింది? బయ్యర్ల పరిస్థితేంటి? అనేది పక్కన పెడితే, పూరి, విజయ్, ఛార్మి విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతున్నారు.
సినిమా విడుదలకు ముందు `ఆగ్ లగాదేంగే` అంటూ వీర లెవిల్లో కామెంట్లు చేసిన విజయ్ ని ఓ లెవిల్ లో ఆడుకుంటున్నారు జనాలు. పూరి సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. అసలు ఈ సినిమాకి పూరి దర్శకుడా? లేదంటే ఛార్మితో డైరెక్షన్ కూడా చేయించేశాడా? అంటూ ఆట పట్టిస్తున్నారు. ఛార్మి కూడా భారీగా ట్రోలింగ్ కి గురవుతోంది. ఛార్మి వల్లే పూరి ఇలా తయారయ్యాడని, ఛార్మిని వదిలేస్తే తప్ప పూరి బాగుపడడని జనాలంతా సోషల్ మీడియా సాక్షిగా మొత్తుకుంటున్నారు.
ఇవన్నీ ఛార్మిని ఇబ్బంది పెట్టే విషయాలే. అందుకే ఛార్మి తెలివిగా సోషల్ మీడియాని స్కిప్ చేస్తున్నట్టు ప్రకటించేసింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ఛార్మి ట్విట్టర్ లో పేర్కొంది. అయితే త్వరలోనే బౌన్స్ బ్యాక్ అవుతానని, అప్పటి వరకూ కూల్ ఆ ఉండమని ధీమా వ్యక్తం చేసింది. ఛార్మి ట్రోలింగ్ కి భయపడే వెనకడుగు వేసిందన్నది సుస్పష్టం. కాకపోతే. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓ మంచి సినిమా తీసి తనని తాను నిరూపించుకోవాలి. కాకపోతే... సినిమా ప్రమోషన్లలో కాస్త అతిగా ఆవేశ పడడం తగ్గించుకోవాలి. లేదంటే ఇలానే ట్రోలింగ్ కి గురి కావాల్సి వస్తుంది.