గతేడాది సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు తను ఆసుపత్రికే పరిమితమయ్యాడు. ఆ తరవాత డిశ్చార్జ్ అయినా ఇల్లు వదిలి బయటకు రాలేదు. మళ్లీ కెమెరా ముందుకు రావడానికి కొంత టైమ్ తీసుకొన్నాడు.
ఎట్టకేలకు.. తేజ్ ఇప్పుడు బయట కనిపిస్తున్నాడు. ఇటీవల తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా `రంగ రంగ వైభవంగా` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అతిథిగా వచ్చాడు. మనిషి ఇదివరకటిలా కనిపించినా, మాట తీరు, తన నడక... ఇవన్నీ అభిమానుల్ని కలవర పెడుతున్నాయి. స్టేజీపైకి వెళ్లేటప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు. మాట తీరులోనూ తేడా ఉంది. కొన్ని పదాలు స్ఫష్టంగా పలకలేకపోవడం.. అభిమానులూ గమచించారు. తేజ్ యాక్సిడెంట్ తరవాత... ఇది వరకటంత ఫిట్ గా లేడని, ఇంకా ఆ ఎఫెక్ట్ తనపై ఉందని, తను 100 శాతం ఫిట్ గా మారడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలుస్తోంది.
తేజ్ కొత్త సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఆ షూటింగ్ కూడా నిదానంగానే నడుస్తోంది. తేజ్ మంచి డాన్సర్. ఫైట్స్‌లో ఈజ్ ఉంటుంది. అయితే... ఇది వరకటిలా తను డాన్సులు చేయగలడా, ఆ ఈజ్ చూపించగలడా? అనే డౌటు వ్యక్తం అవుతోంది. యాక్సిడెంట్ తరవాత తన ఆరోగ్య పరిస్థితేంటి? ఇప్పుడు ఎలా ఉంది? అనే విషయాలు తేజ్ చెబితేగానీ బయటకు తెలీదు.