డ్రగ్స్‌ ఆరోపణలపై ఛార్మి తండ్రి ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిలో నటి ఛార్మి ఒకరు. పూరీ జగన్నాధ్‌ తర్వాత ఛార్మి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఛార్మి తండ్రి దీప్‌ సింగ్‌ స్పందించారు. తన కూతురు అలాంటిది కాదనీ, పదమూడేళ్లకే సినీ రంగంలోకి వచ్చిందనీ, చాలా బాధ్యతతో ఉంటుంది ఛార్మి అని ఆయన అన్నారు. కుటుంబ బాధ్యతల్ని చిన్నతనంలోనే భుజానికెత్తుకున్న ఛార్మి ఎన్నటికీ ఇలాంటి పని చేయదనీ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అంతేకాదు, చాలా పద్థతి కల కుటుంబం నుండి వచ్చిందనీ, చిన్నతనం నుండీ చాలా క్రమశిక్షణతో పెరిగింది. తమకి చెప్పకుండా ఎక్కడికీ వెళ్లదనీ, అలాంటి ఛార్మికి డ్రగ్స్‌ తీసుకునే అవసరం అస్సలు లేదనీ ఆయన అన్నారు. అంతేకాదు ఈ విషయం ముందు ముందు మీకే తెలుస్తుందనీ, సంచలనాల కోసం అవాస్తవాల్ని ప్రచారం చెయ్యొద్దనీ దీప్‌ సింగ్‌ అన్నారు. ఛార్మి మీద ఎంత నమ్మకం ఉన్నా, కుటుంబ సభ్యులుగా ఈ వార్తలతో మేమెంతో ఆందోళన చెందుతున్నామనీ ఆయన అన్నారు. ఖచ్చితంగా ఛార్మిపై క్లీన్‌ చిట్‌ రావాలని, వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ ఇష్యూతో సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన పూరీ జగన్నాధ్‌ ఈ రోజు సిట్‌ ఎదుట హాజరయ్యారు. రేపు ఛార్మి హాజరు కావాల్సి ఉంది. పూరీ, ఛార్మి కలిసి సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌ అనే సంస్థని నిర్వహిస్తున్నారు. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS