SIT విచారణ కి సంబంధించి నటి చార్మీ వేసిన పిటీషన్ పై హైకోర్టులో ఈ ఉదయం విచారణ జరిగింది.
ఇటు చార్మీ తరపున న్యాయవాది అటు ఎక్ష్కైజ్ శాఖ న్యాయవాది చార్మీ వేసిన పిటీషన్ పై తమ తమ వాదనలు వినిపించారు. విచారణ న్యాయబద్ధంగా జరగటం లేదని, విచారాణ పేరుతో బ్లడ్ శాంపిల్స్ ని బలవంతంగా సేకరిస్తున్నట్టు చార్మీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
దీనికి కౌంటర్ గా ఎక్ష్కైజ్ శాఖ న్యాయవాది తన వాదన వినిపిస్తూ- విచారణ మొత్తం చట్టబద్ధంగా అలాగే వీడియో రికార్డింగ్ లో జరుగుతున్నది అని, తమ ఇష్టపూర్వకంగానే బ్లడ్ శాంపిల్స్ ఇప్పటివరకు ఇచ్చారు అని చెప్పారు.
ఇరు వైపు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది అని తెలిపింది.