డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణకు హాజరైన ఛార్మి, ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి చేరింది. సాయంత్రం 5 గంటలకల్లా ఛార్మి విచారణ ముగించుకుని బయటికి వచ్చేసింది. ఉదయం సిట్ కార్యాలయానికి వచ్చిన ఛార్మి ఒకింత డల్‌గా, టెన్షన్‌గా కనిపించింది. సవినయంగా మీడియాకి నమస్కారం చేసి లోనికి ప్రవేశించింది. విచారణ ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఛార్మి చాలా హ్యాపీగా కనిపించింది. ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ మీడియాకి అభివాదం చేసింది. ఉదయం కార్యాలయంలోకి బయలుదేరే నేపథ్యంలో ఆమెపై ఓ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఛార్మి, సిట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి, ఛార్మి విచారణకు ముందే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బ్లడ్ శాంపిల్స్, ఇతరత్రా పరీక్షల విషయంలో తనను పోలీసులు బలవంతం చేయరాదనీ, ఛార్మి పెట్టిన పిటీషన్‌ను న్యాయస్థానం మన్నించింది. ఆమె అనుమతి ఇస్తేనే, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలనీ ఎటువంటి బలవంతం చేయరాదనీ, అధికారులకు కోర్టు సూచించింది. అలాగే న్యాయస్థానం సూచించిన సమయం ఉదయం 10 గంటల నుండి, సాయంత్రం 5 గంటల వరకే ఛార్మిని సిట్ అధికారులు విచారణ చేశారు. మొత్తానికి ఛార్మి విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న వారిలో పూరీ తర్వాత శ్యామ్.కె.నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నా, ఛార్మిలను విచారంచింది సిట్ బృందం. రేపు ముమైత్ ఖాన్‌ని విచారించనుంది సిట్ బృందం.