ఛార్మి లిమిటెడ్‌ ఎడిషన్‌ చూస్తారా?

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ ఛార్మి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. స్పెషల్‌ సాంగ్స్‌లోనూ నర్తించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కానీ 'పూరీ కనెక్ట్స్‌ (పిసి)' పేరు మీద బాలయ్య - పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పైసా వసూల్‌' సినిమాకి సంబంధించి నిర్మాణ పర్యవేక్షణలో బిజీగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన నటీ నటుల ఎంపిక, టెక్నికల్‌ వర్క్స్‌కి సంబంధించిన పలు అంశాలు ఛార్మి చేతుల మీదుగానే జరిగాయి. ఈ సినిమా షూటింగ్‌ పోర్చుగల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌ నిమిత్తమే ఛార్మి పోర్చుగల్‌ వెళ్లింది. అయితే తాజాగా అమ్మడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఎందంటారా? ఛార్మి చేతి మీదా, కాలి మీదా టాటూలు వేయించుకుంది. ఆ టాటూలతో తన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ పోస్టులే ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. చేతి మీద ఛార్మి 'అన్‌లిమిటెడ్‌ ఎడిషన్‌' అని టాటూ వేయించుకుంది. కాలి మీద కూడా ఓ టాటూ వేయించుకుంది. అది ఇంగ్లీషులోని ఓ కొటేషన్‌లా అనిపిస్తోంది. పోర్చుగల్‌లోనే ఛార్మి ఈ టాటూలు వేయించుకునుంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. గతంలో పలు హీరోయిన్లు ఇలా టాటూలు వేయించుకుని పాపులర్‌ అయ్యారు. శృతిహాసన్‌, త్రిష, సమంత పలువురు హీరోయిన్లు ఇలాగే టాటూలు వేయించుకున్నారు. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS