లౌక్యం, పైసా వసూల్, చెక్ లాంటి సినిమాలను అందించిన నిర్మాత భవ్య ఆనంద ప్రసాద్. `భవ్య` సిమెంట్స్ అధినేత కూడా. రాజకీయాల్లోనూ ఉన్నారు. ఈయనపై రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌పరిధిలో చీటింగ్ కేసు నమోదైంది. భవ్య సిమెంట్ లో తనకు 4 శాతం వాటా ఇస్తానని, కోటి రూపాయలు తీసుకున్నట్టు, ఇప్పుడు ఆ కోటి అడిగితే.. చంపుతా అని బెదిరిస్తున్నట్టు ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భవ్య ఆనంద్ ప్రసాద్ కోసం వెదుతుకున్నారు. అయితే ఆయన పరారీలో ఉన్నట్టు టాక్. ఆనంద్ ప్రసాద్ ఇలాంటి వ్యవహారాలు చాలా నడిపారని, చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని, అవన్నీ కలిపితే వంద కోట్ల వరకూ ఉంటుందని, ఎవరూ బయటకు చెప్పడం లేదని ఫిర్యాదు దారులు చెబుతున్నారు.
ఆనంద్ ప్రసాద్ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ అమెరికా వెళ్లారని, ఆ విషయం తెలిసి కూడా... ఆయన్ని ఇరికించాలని ఈ కేసు పెట్టారని... ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల నితిత్‌తో `చెక్` సినిమా తెరకెక్కించారు ఆనంద్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆయనకు భారీ నష్టాలు మిగిల్చింది.