ఓ సినిమా హిట్టయితే... సీక్వెల్ చేయాలన్న ఆశ పుడుతుంది. అయితే అన్ని హిట్ సినిమాలూ సీక్వెల్స్‌కి పనికిరావు. కొన్నే ఆ తరహా కథలు పుడుతుంటాయి. `చెక్` సినిమాని సీక్వెల్ చేయొచ్చు. ఎందుకంటే.. క్లైమాక్స్ ఎటూ కాకుండా ఉండిపోయింది కాబట్టి. ఈ సినిమా బాగా ఆడితే సీక్వెల్ చేద్దామనుకున్నాడట చంద్రశేఖర్ యేలేటి. ఈ విషయాన్ని నితిన్ కూడా చెప్పాడు.
``ఈ సినిమాకి సీక్వెల్ చేయొచ్చు. దానికి సరిపడా కథ కూడా ఉంది. కాకపోతే.. `చెక్` హిట్టవ్వాలి`` అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నితిన్. అయితే ఇప్పుడు ఆ సీక్వెల్ ఆశలు గల్లంతయినట్టే. ఎందుకంటే.. `చెక్`కి వస్తున్న స్పందన అంతంత మాత్రమే. క్లైమాక్స్ మరీ పేలవంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇలాంటి కథకు సీక్వెల్ చేయకపోవడమే మంచిది. ఈ సినిమా హిట్టయితే... తప్పకుండా చంద్రశేఖర్ యేలేటి ఆ ప్రయత్నం చేద్దుడేమో..? నితిన్ కూడా ఉత్సాహం చూపించేవాడు. ఇప్పుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు..??