హీరో విశాల్ - ఈ పేరు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. పోయిన ఏడాది జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో పాల్గొని అందరికి షాక్ ఇచ్చిన విశాల్, ఇప్పుడు అదే తరహాలో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టడం కూడా చర్చనీయంశంగా మారింది.
ఈ తరుణంలో ఆయనకీ సినీపరిశ్రమలో వ్యతిరేక వర్గం విశాల్ పైన విమర్శలు ఎక్కు పెట్టింది. హీరో-దర్శకుడు అయిన చేరన్ ఈ అంశం పైన విశాల్ కి వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నారు, అంతేకాకుండా నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసాకే రాజకీయాల్లోకి వెళ్ళాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంకి సంబంధించి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపాడు.
విశాల్ స్వంత ఇమేజ్ ని పెంచుకొనే యోచనలోనే ఇలాంటి పనులకి శ్రీకారం చుడుతున్నాడు అంటూ విమర్శలు ఆయన వ్యతిరేక వర్గం చేస్తున్నది. ఇక విశాల్ నామినేషన్ వేసే ముందు MGR, జెమినీ గణేషన్, జయలలితకి నివాళ్ళు అర్పించడం కొసమెరుపు.
మరి ఈ రాజీనామా పై విశాల్ ఏమంటాడో..