చిలసౌ సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

సుశాంత్,రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'చిలసౌ'. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. 

ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రోహిణి మరియు అను హసన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.  భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ,సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.  

కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా ప్రకటించింది చిత్ర బృందం.

- ప్రెస్ రిలీజ్  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS