ఆ వెడ్డింగ్ బ్యూటీలో ఇంత హాట్‌నెస్ దాగుందా.? అనుకుంటున్నారా.? అసలింతకీ ఈ బ్యూటీని గుర్తు పట్టారా.? రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'చిలసౌ' సినిమాలో హీరోయిన్‌గా నటించిందీ ముద్దుగుమ్మ. హమ్మయ్యా.. గుర్తొచ్చిందనుకుంటా.. అదేంటీ ఆ సినిమాలో అంత ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీలో ఇంత గ్లామర్ దాగుందంటే నమ్మలేకపోతున్నాం అనుకుంటున్నారా.. నమ్మాల్సిందే మరి. చూస్తున్నారుగా. ఇది నిజం.
తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈ ఫోటోకి పిచ్చ పిచ్చగా లైకులూ, షేర్లూ వచ్చి పడుతున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ పేరు గుర్తు చేసుకోలేదు కదా. రుహానీ శర్మ. తొలి సినిమాకే పర్‌ఫామెన్స్ చించేసింది. కానీ గ్లామర్‌కి దూరమేమో అనుకున్నారంతా. అలాంటి వారి అనుమానాలు ఈ ఫోటోతో పటాపంచలు చేసేసింది. ఇంతగా హాట్‌నెస్ చూపిస్తే, అవకాశాలెందుకు కరువవుతాయి చెప్పండి. ఎగ్జాక్ట్ ఫిజిక్‌తో కుర్రకారును రెచ్చగొట్టేలా ఉన్న అమ్మడి అందాలకు మన దర్శక, నిర్మాతలు ఫిదా అవుతారేమో చూడాలి మరి.
ALSO SEE : ruhani sharma latest photoshoot