సోషల్ మీడియా ఛాలెంజ్‌ల పేరుతో వెర్రి పీక్స్‌కి చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న టెన్ ఇయర్స్ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రిటీలు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నామో, ఇప్పుడెలా ఉన్నామో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే పాపం.! ఈ ఛాలెంజ్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకు తీరని అవమానం జరిగింది. ప్రియాంక తన కన్నా 12 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోసెఫ్‌ని ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే.
ఈ వివాహం కారణంగా ఎన్ని రకాల అవమానాలు పడాలో, ఎన్ని వివాదాలు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొంది ప్రియాంకా చోప్రా. అయితే తాజాగా మరోసారి ప్రియాంకా చోప్రా తన ప్రియుడి విషయంలో అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. 2009లో ప్రియాంకా ఓ చంటిపిల్లాడిని ఎత్తుకుని ఉన్న పిక్, 2019లో నిక్‌తో రొమాంటిక్‌గా నవ్వులు చిందిస్తున్న పిక్‌ని టెన్ ఇయర్స్ ఛాలెంజ్‌లో భాగంగా మీమ్ చేసి పోస్ట్ చేశారు నెటిజన్లు. ఈ పిక్‌కి ప్రియాంకా స్పందించలేదు. కానీ, గాయని చిన్మయి మాత్రం ఘాటుగా స్పందించింది.
సోషల్ మీడియాలో ఆకతాయిలకు అదుపే లేకుండా పోతోంది. మగవాళ్లు తనకన్నా 25 ఏళ్లు చిన్నగా ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటుంటే ఏమీ అనరు.? ఆఖరికి 60 ఏళ్ల వృద్ధులు కూడా 25 ఏళ్ల అమ్మాయిలతో పెళ్లికి సిద్ధపడుతున్న సమాజం మనది.. అలాంటిది తన కన్నా చిన్నవారిని అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు..? అని ప్రశ్నించింది. నిన్న, మొన్న జరిగిన రకుల్ కాస్ట్యూమ్ వివాదంలో కూడా చిన్మయి ఇంతే ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.