సోషల్ మీడియాలో అర్ధ నగ్నంగా ఫోటోలు, వీడియోలు పెట్టడం పూనమ్ పాండేకి అలవాటు. వాటి కోసం ఎగబడే ఫాలోవర్స్ బోలెడంత మంది ఎప్పుడూ ఉంటారు. తాజాగా నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ వీడియో పోస్ట్ చేసింది పూనమ్ పాండే. అందులో పూనమ్ పాండే ఓ వ్యక్తితో కలిసి శృంగారం జరుపుతోంది. అదీ న్యూడ్‌గా.
ఏమైందో కానీ, కొద్ది క్షణాల్లోనే ఆ వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మాయమైంది. దీనికి వివరణ ఇస్తూ, తన అకౌంట్లో ఓ వ్యక్తి ఆ వీడియో పెట్టాడనీ, వీడియోలో ఉన్న వ్యక్తే ఆ పని చేశాడనీ, అది ఎలా లీకైందో తనకు తెలియదని వివరణ ఇచ్చింది పూనమ్‌పాండే. ఆమెకు తెలియకుండా ఇంకో వ్యక్తితో శృంగారంలో ఎలా పాల్గొంటుంది అని ఆమె ఇచ్చిన వివరణకు జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
అయినా ఇలాంటివి పూనమ్పాండేకి కొత్తేమీ కాదు. పూనమ్ పాండేకి మాత్రమే తెలిసిన పబ్లిసిటీ స్టంట్స్ ఇవి. ఎలాగోలా పబ్లిసిటీ చేసుకోవడం, తద్వారా వార్తల్లో నిలవాలనుకోవడం పూనమ్పాండేకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే ఈ తాజా వీడియోతో లేటెస్టుగా పబ్లిసిటీ స్టంట్ చేసిందనుకోవాలి.