క్లీవేజ్ అనే మాట సాధారణంగా హాట్ బ్యూటీస్ కోసం వాడుకలో ఉన్న పదం. అయితే తాజా గా ఈ పదాన్ని చాక్లెట్ బోయ్ నిఖిల్ తన కోసం వాడేశాడు. దాంతో ఈ పదంపై సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ మొదలైంది. అసలింతకీ నిఖిల్ ఈ పదం ఎందుకు వాడాల్సి వచ్చిందయ్యా అంటే.. సోషల్ మీడియాలో ఇప్పుడు టెన్ ఇయర్స్ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
సెలబ్రిటీసే కాదు, సాధారణ పీపుల్ కూడా ఈ టెన్ ఇయర్స్ ఛాలెంజ్ వెర్రిలో ఉర్రూతలూగుతున్నారిప్పుడు. అందులో భాగంగానే నిఖిల్ కూడా తన టెన్ ఇయర్స్ బ్యాక్ ఫోటో, ప్రజెంట్ ఫోటో పోస్ట్ చేశాడు. టెన్ ఇయర్స్ బ్యాక్ నిఖిల్ క్యూట్‌గా మామూలుగా ఉన్నాడు. ఇప్పటి ఫోటోలో కండలు తీరి జెంటిల్‌గా ఉన్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ 2019 ఫోటోతో పాటు, ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఆ క్యాప్షన్‌లోనే క్లీవేజ్ అనే పదం వాడాడు. ఆ పదమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ఆడవాళ్లకు వాడే పదాన్ని నీకు వాడుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది నిఖిల్ భయ్యా అంటూ ఆయన ఫ్యాన్స్ కొంతమంది ట్వీట్లు వేస్తుంటే, కాస్త కాదు, చాలా చాలా ఇబ్బందిగా ఉందంటూ నెటిజన్లు చిరాకు పడుతున్నారు. సోషల్ మీడియాలో నిఖిల్ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ప్రతీ విషయంలోనూ స్పందిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక్కోసారి గుడ్ కీప్ ఇట్ అప్ అనిపించుకుంటే, ఇదిగో ఇలా అప్పుడప్పుడూ విసిగిస్తూ, నెగిటివిటీని కూడా ఖాతాలో వేసుకుంటుంటాడు.