మెగాస్టార్ చిరంజీవి తన రీ-ఎంట్రీ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగారాసేశాడు. ఇక తన తదుపరి చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని దాదాపుగా ప్రకటించేశాడు.
మరీ ఈ చిత్ర నిర్మాణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో రూపొందనుంది. అయితే ఈ చిత్రానికి బడ్జెట్ రూ 100 కోట్లు దాటనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎందుకంటే, నరసింహ రెడ్డి పాత్ర తన శత్రువులతో చేసే యుద్ధాలు కథలో కీలకంగా ఉన్నాయట. అలాగే గెరిల్లా తరహా యుద్ధ సన్నివేశాలను సహజంగా చిత్రీకరించాలి అంటే బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా సినిమాని నిర్మించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఇక మన తెలుగు సినిమా మార్కెట్ కూడా విస్తరిస్తున్న ఈ తరుణంలో పెట్టుబడి తిరిగి రాబట్టుకోగాలమనే నమ్మకం కూడా ఉండడంతో ఈ బడ్జెట్ కి పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది.