మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 తరువాత ఆయన చేస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రానికి సంబందించిన ఒక కీలక సమాచారం తెలిసింది.
అదేంటంటే- సైరా చిత్రానికి సంబంధించిన టెస్ట్ షూట్ ఈ మధ్యనే జరిగింది అని అలాగే ఆ టెస్ట్ షూట్ తో దర్శకుడు సహా టీం మొత్తం సంతృప్తిచెందిందట. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన భారీ సెట్స్ నిర్మాణం జరుగుతున్నది అని అలాగే సైరా యూనిట్ కూడా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం.
మొత్తానికి ఎప్ప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న సైరా త్వరలోనే పట్టలేక్కనుందనమాట.