మాస్ మహారాజ రవితేజ గ్యాప్ తీసుకొని మరి వచ్చి రాజా ది గ్రేట్ చిత్రం ద్వారా ఒక పెద్ద హిట్ కొట్టాడు.
ఇక తన తదుపరి చిత్రం టచ్ చేసి చూడు చిత్ర షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఇదిలావుండగా రవితేజ-శ్రీను వైట్ల కలయికలో ఓ చిత్రం రానుంది అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ చిత్రానికి ఒక ఆసక్తికర టైటిల్ ని పెట్టె యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఆ చిత్రంలో హీరో పాత్ర మూడు విభిన్న కోణాల్లో ఉండనుంది అని అందుకే ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ అంటోనీ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ పేరుతో బాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.
మొత్తానికి మాస్ మహారాజ తను చేయబోతున్న చిత్రాల్లో కచ్చితంగా వైవిధ్యం చూపిస్తూనే ఉన్నాడు.