విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జార్జిరెడ్డి అనే పేరుతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సినిమాలో కీలకంగా వచ్చే ‘అడుగడగుడు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు’అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియొట్ చదువుకుంటున్నప్పుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు మీ సినిమా జార్జిరెడ్డి ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే మీ సినిమా ద్వారా మరోసారి వింటున్నాను. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు అక్కడి నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ఈ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను" అన్నారు.
"జార్జిరెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు.. ఏ రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి.. తప్పును ప్రశ్నించడం కోసం విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎదుర్కొన్నాడు అనేది ఈ పాటతో తెలుస్తుంది.అలాగే సినిమాను కూడా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు రావాలి. జార్జిరెడ్డి బాటలో ఈ యూనివర్శిటీ నుంచి చాలామంది వచ్చారు. జార్జిరెడ్డి వంటి అగ్రెసివ్ వ్యక్తుల కథలు ఇంకా రావాలి. ఈ సినిమా మీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను.. ఇంత మంచి సినిమా తీసిన యంగ్ టీమ్ దర్శకుడు జీవన్ రెడ్డి, డివోపి సుధాకర్ రెడ్డి, ,నిర్మాతలు సంజయ్ రెడ్డి, అప్పిరెడ్డి,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’అన్నారు.