'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'జార్జి రెడ్డి'. ఈ మధ్య బాగానే చర్చల్లో నిలుస్తోంది ఈ చిత్రం. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా దక్కించుకున్నాడీ 'జార్జి రెడ్డి'. ఈ నెలలోనే సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. కానీ, రిలీజ్ విషయంలో సందిగ్థం ఏర్పడింది. ఇంతవరకూ సెన్సార్ రిపోర్ట్ రాలేదు. మరోవైపు సినిమా రిలీజ్‌ని అడ్డుకుంటూ, ఏబీవీపీ నుండి కొన్ని హెచ్చరికలు జారీ అవుతున్నాయట.
అసలెందుకీ 'జార్జిరెడ్డి'కి ఇన్ని పాట్లు.? అంటే, ఈ సినిమాలో ఓ స్టూడెంట్ లీడర్ బయోపిక్. అదేంటీ.? స్టూడెంట్ లీడర్ సినిమా అయితే, అడ్డంకి ఏంటీ.? గతంలో చాలా స్టూడెంట్ లీడర్స్ సినిమాలొచ్చాయి కదా.! అనుకుంటున్నారా.? అవన్నీ కల్పిత గాధలు. ఇది రియల్ గాధ కదా. అదే ఈ సినిమా రిలీజ్‌కి అడ్డు తెస్తున్న అసలు సమస్య. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అయిన జార్జి రెడ్డి అప్పట్లో స్టూడెంట్ లీడర్‌గా చాలా పాపులారిటీ దక్కించుకున్నాడు. దురదృష్టవశాత్తూ ప్రత్యుర్ధుల చేతుల్లో కన్ను మూసిన జార్జిరెడ్డి పాతికేళ్ల జీవిత గాధ వెనుక ప్రపంచానికి తెలియని అత్యంత రహస్యాల్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారట. దాంతో 'అఖిల్ భారత విద్యార్ధి పరిషత్తు, ఈ సినిమా రిలీజ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందట.
ఈ సినిమాపై ఇప్పటికే ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయ్యింది. ఇలాంటి వివాదాలు చుట్టు ముడితే, ఆ హైప్ మరింత పెరుగుతుందే తప్ప, తగ్గదు. అసలింతకీ జార్జి రెడ్డి జీవితంలోని తెలియని ఆ సీక్రెట్స్ ఏంటీ.? అవి తెలిస్తే, ఏబీవీపీకి వచ్చే సమస్యలేంటీ.? అనేది తెలసుకోవాలంటే 'జార్జిరెడ్డి' సినిమాలో ఏముందో చూడాల్సిందే. నిరంతర చర్చల్లో నిలుస్తూ, ఇంతలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయడంలో దర్శక, నిర్మాతలు సక్సెస్ అవుతారా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.